
క్రీడలు

ప్రధాన ఎన్నికల కమిషనర్, ఎన్నికల కమిషనర్ నియామకాల ఎంపిక కమిటీల్లో భారత ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రిని నియమించే చట్టాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్‌పై సుప్రీం కోర్టులో విచారణ కొనసాగుతోంది. ఈ కేసును వాయిదా వేయాలని కేంద్ర ప్రభుత్వం కోరింది. అయితే కోర్టు ఆ అభ్యర్థనను తిరస్కరించింది.
విచారణ అత్యంత ముఖ్యమైనదిగా పేర్కొంటూ సుప్రీం కోర్టు, ముందుగా నిర్ణయించిన తేదీ ప్రకారమే కొనసాగుతుందని స్పష్టం చేసింది. శబరిమల కేసును ప్రస్తావిస్తూ వాయిదా అభ్యర్థనను తిరస్కరించింది. ఈ నియామక విధానం కేంద్రానికి అనుకూలంగా మారే అవకాశం ఉందన్న ఆందోళనల నేపథ్యంలో ఈ కేసు ప్రాధాన్యం సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!