

యూట్యూబ్‌లో క్రియేటర్ల సంఖ్య భారీగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త క్రియేటర్లకు మోనిటైజేషన్ నిబంధనలను మరింత కఠినతరం చేయనున్నట్లు సమాచారం. కొత్త నిబంధనల ప్రకారం యూట్యూబ్ పార్ట్‌నర్ ప్రోగ్రామ్ (YPP) ద్వారా ఆదాయం పొందేందుకు గత 12 నెలల్లో 8,000 గంటల వాచ్ టైమ్ లేదా 90 రోజుల్లో 2 కోట్ల షార్ట్స్ వ్యూస్ సాధించాలి. గతంలో 1,000 సబ్‌స్క్రైబర్లతో పాటు 4,000 గంటల వాచ్ టైమ్ లేదా 90 రోజుల్లో కోటి షార్ట్స్ వ్యూస్ ఉంటే అర్హత లభించేది. కొత్త నిబంధనలు ఫిబ్రవరి 1 నుంచి అమల్లోకి రానుండగా, ఇప్పటికే YPPలో ఉండి ఆదాయం పొందుతున్న క్రియేటర్లపై ప్రభావం ఉండదు.
షార్ట్స్ క్రియేటర్ పూల్ ద్వారా నిరంతరం ఆదాయం పొందాలంటే 90 రోజుల్లో కోటి షార్ట్స్ వ్యూస్‌ను కొనసాగించాలని యూట్యూబ్ స్పష్టం చేసింది. వ్యూస్ తగ్గితే షార్ట్స్ ఆదాయం మాత్రమే నిలిచిపోతుంది; లాంగ్ ఫార్మాట్ వీడియోల ఆదాయం మాత్రం కొనసాగుతుంది. మళ్లీ అవసరమైన వ్యూస్ సాధించిన తర్వాత షార్ట్స్ ఆదాయం పునరుద్ధరించబడుతుంది. ప్రస్తుతం రోజుకు 200 బిలియన్లకు పైగా షార్ట్స్ వ్యూస్ వస్తున్నాయని, టీవీల్లో రోజుకు బిలియన్ గంటలకు పైగా వాచ్ టైమ్ నమోదవుతోందని యూట్యూబ్ తెలిపింది. అలాగే తక్కువ ధరలో లభించే ప్రీమియం లైట్ సబ్‌స్క్రిప్షన్‌ను విస్తరిస్తోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!