11, ఆగస్టు 2026, మంగళవారం
మా గురించిమమ్మల్ని సంప్రదించండిగోప్యతా విధానం
Tea Time TeluguAd
జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యం
ENGLISH
Login
logo
హోమ్జనరల్రాజకీయంసినిమాగాసిప్స్రివ్యూస్గ్యాలరీవీడియోలుషోస్ఓటిటిక్రీడలుబిజినెస్టెక్నాలజీఆరోగ్యంపోల్స్బుకింగ్స్
English
Tea Time Telugu logo
మా గురించిరెఫరల్ గైడ్మమ్మల్ని సంప్రదించండిఫీచర్ అభ్యర్థనగోప్యతా విధానం

కాపీరైట్ © 2026 అన్ని హక్కులు Eagle Eye Technologies సొంతం.

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

Writer: Pooja 11:46 AM, 11 ఆగస్టు, 2026
డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

డీజిల్‌లో ఇథనాల్ కలపాలన్న ప్రతిపాదనను కేంద్ర ప్రభుత్వం ప్రస్తుతానికి నిలిపివేసింది. ఇథనాల్ కలపడం వల్ల డీజిల్ ఫ్లాష్ పాయింట్ గణనీయంగా తగ్గుతున్నట్లు పరీక్షల్లో తేలడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. పెట్రోలియం, సహజ వాయువుల శాఖ సహాయ మంత్రి సురేష్ గోపి రాజ్యసభలో ఈ విషయాన్ని వెల్లడించారు. ప్రభుత్వ రంగ చమురు సంస్థల ఆర్‌అండ్‌డీ కేంద్రాలు, గుర్తింపు పొందిన ప్రయోగశాలలు, ఆటోమొబైల్ సంస్థలు, ఇతర సాంకేతిక సంస్థల సహకారంతో ఈ పరీక్షలు నిర్వహించినట్లు తెలిపారు.

ఫ్లాష్ పాయింట్ అంటే ఇంధనం నుంచి వెలువడే ఆవిరి బాహ్య జ్వాల లేదా నిప్పురవ్వ తగిలినప్పుడు క్షణకాలం మండగలిగే అత్యల్ప ఉష్ణోగ్రత. ఫ్లాష్ పాయింట్ తగ్గడం వల్ల ఇంధనం నిల్వ, రవాణా, నిర్వహణ సమయంలో భద్రతాపరమైన ప్రమాదాలు పెరిగే అవకాశం ఉంటుంది. ఇదిలా ఉండగా, ప్రస్తుతం E20 కంటే ఎక్కువ ఇథనాల్ కలిగిన పెట్రోల్‌పై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని కేంద్రం స్పష్టం చేసింది. భవిష్యత్తులో E20కి మించి మిశ్రమాన్ని పెంచాలంటే శాస్త్రీయ, సాంకేతిక అధ్యయనాలు, పరిశ్రమ వర్గాలతో సంప్రదింపుల తర్వాతే నిర్ణయం తీసుకుంటామని తెలిపింది.

E20 పెట్రోల్ వినియోగంపై కేంద్రం సానుకూలంగా ఉంది. ARAI, SIAM, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ పెట్రోలియం తదితర సంస్థలు నిర్వహించిన పరీక్షలు, ఫీల్డ్ ట్రయల్స్‌లో ఇంజిన్ జీవితకాలం, డ్రైవింగ్ పనితీరు, స్టార్టింగ్, తుప్పు, ఇంధన అనుకూలత, మైలేజీ వంటి అంశాలను పరిశీలించినట్లు కేంద్రం తెలిపింది. ఇప్పటికే ఉన్న పాత వాహనాల్లో ఇథనాల్ మిశ్రమ ఇంధనం వల్ల విస్తృత స్థాయిలో ఇంజిన్ వైఫల్యాలు లేదా బ్రేక్‌డౌన్‌లు జరిగినట్లు నిర్ధారించే ఆధారాలు లేవని పేర్కొంది.

మీ స్పందన ఏమిటి? 0 ఓట్లు

Advertisement
కామెంట్లు లోడ్ అవుతున్నాయి...
సూచించబడిన పోస్ట్‌లు
కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్

సోషల్ మీడియా కేసుల్లో బిగ్‌టెక్‌కు భారీ ఎదురుదెబ్బ

సోషల్ మీడియా కేసుల్లో బిగ్‌టెక్‌కు భారీ ఎదురుదెబ్బ

బిట్‌కాయిన్‌ వ్యూహంలో చాట్‌జీపీటీ

బిట్‌కాయిన్‌ వ్యూహంలో చాట్‌జీపీటీ

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

నేడు బంగారం ధరలు ఎలా ఉన్నాయంటే?

12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్‌

12 ఏళ్లలో రూ.10 లక్షల కోట్ల రుణాలు రైటాఫ్‌

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

స్వల్ప లాభాలతో ముగిసిన స్టాక్ మార్కెట్లు

ట్యాగ్లు
ఇథనాల్ మిశ్రమండీజిల్ భద్రతE20 పెట్రోల్ఇంధన విధానంకేంద్ర ప్రభుత్వంఆటోమొబైల్ రంగం
AdvertisementAdvertisement
మమ్మల్ని అనుసరించండి
ఫేస్‌బుక్ఇన్‌స్టాగ్రామ్యూట్యూబ్ట్విట్టర్వాట్సాప్
తాజా కథనాలు లోడ్ అవుతున్నాయి...
తాజా కథనాలు
ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే
క్రీడలు

ప్రపంచకప్‌ కోసం కఠిన పరీక్ష...విండీస్‌ పరిస్థితి ఇదే

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం
బిజినెస్

డీజిల్‌లో ఇథనాల్ కలపొద్దు...కేంద్రం కీలక నిర్ణయం

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్
సినిమాలు

రాజు బొనగాని దర్శకత్వంలో ‘ఆఫ్టర్ ఇంజనీరింగ్’.. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్
బిజినెస్

కొత్త క్రియేటర్లకు యూట్యూబ్ మోనిటైజేషన్ షాక్

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు
జనరల్

పార్లమెంట్ ఆవరణలో NDA, INDIA ఎంపీల పోటాపోటీ నిరసనలు

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు
జనరల్

NEET, FCRA బిల్లులకు తమిళనాడు అసెంబ్లీ వ్యతిరేక తీర్మానాలు

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల
జనరల్

తెలంగాణలో కొత్త ఆసరా పింఛన్లకు మార్గదర్శకాలు విడుదల

అదానీకి బిగ్ రిలీఫ్.. అమెరికా కేసులో కోర్టు కీలక నిర్ణయం
జనరల్

అదానీకి బిగ్ రిలీఫ్.. అమెరికా కేసులో కోర్టు కీలక నిర్ణయం

తెలంగాణ సంస్కృతికి ఫిదా...కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా
జనరల్

తెలంగాణ సంస్కృతికి ఫిదా...కన్నీళ్లు పెట్టుకున్న ఫరియా

చైనా ఆక్రమణపై అరుణాచల్ యువకుడి సంచలన ఆరోపణలు
జనరల్

చైనా ఆక్రమణపై అరుణాచల్ యువకుడి సంచలన ఆరోపణలు

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్
సినిమాలు

ఆ స్టెప్‌ విషయంలో బాధపడుతున్నా – శేఖర్ మాస్టర్

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి
జనరల్

ఖుదీరామ్ బోస్‌కు పవన్ కళ్యాణ్ నివాళి

కామెంట్స్ (0)

ఇప్పటికి కామెంట్స్ లేవు

మొదటిగా కామెంట్ చేయండి!