

తలనొప్పికి ఒత్తిడి, నిద్రలేమి, శరీరంలో నీరు తగ్గడం, మొబైల్ లేదా కంప్యూటర్ స్క్రీన్‌లను ఎక్కువసేపు చూడటం, సమయానికి ఆహారం తీసుకోకపోవడం వంటి అనేక కారణాలు ఉండవచ్చు. ఆరోగ్య నిపుణుల ప్రకారం. టీ, కాఫీలో ఉండే కెఫిన్ కొందరికి తలనొప్పి లేదా మైగ్రేన్ నుంచి తాత్కాలిక ఉపశమనం కలిగించవచ్చు. అందుకే కొన్ని తలనొప్పి నివారణ మందుల్లో కూడా కెఫిన్‌ను ఉపయోగిస్తారు. అయితే కెఫిన్ ప్రభావం ప్రతి ఒక్కరిలో ఒకేలా ఉండదు. ఎక్కువగా తీసుకోవడం వల్ల కొందరిలో తలనొప్పి మరింత పెరగవచ్చు.
రోజూ టీ లేదా కాఫీ తాగే అలవాటు ఉన్నవారు ఒక్కసారిగా కెఫిన్‌ను పూర్తిగా మానేస్తే కూడా కెఫిన్ ఉపసంహరణ వల్ల తలనొప్పి రావచ్చు. తలనొప్పి వచ్చినప్పుడు తగినంత నీరు తాగడం, ప్రశాంతమైన చీకటి గదిలో విశ్రాంతి తీసుకోవడం, సమయానికి భోజనం చేయడం, తగినంత నిద్రపోవడం, స్క్రీన్ సమయాన్ని తగ్గించడం వంటి జాగ్రత్తలు తీసుకోవాలి. తలనొప్పి తరచుగా లేదా తీవ్రంగా వస్తుంటే, జ్వరం, వాంతులు, చూపు మసకబారడం, చేతులు లేదా కాళ్లలో బలహీనత, మాట్లాడటంలో ఇబ్బంది వంటి లక్షణాలు ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
గమనిక: పైన ఇచ్చిన సమాచారం కేవలం అవగాహన కోసం మాత్రమే, దీని ఆధారంగా తీసుకునే నిర్ణయాలకు మేము బాధ్యులం కాదు. ఆరోగ్యానికి సంబంధించిన సందేహాలు లేదా సమస్యలు ఉంటే తప్పనిసరిగా అర్హత కలిగిన వైద్యుడిని సంప్రదించి, వారి సూచనలను పాటించండి.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!