

ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సంపద గత ఏడాది కాలంలో ఏకంగా 3,1950 కోట్ల డాలర్లు పెరిగింది. 2025 జూలైలో సుమారు 40,560 కోట్ల డాలర్లుగా ఉన్న ఆయన మొత్తం ఆస్తి విలువ.. ఈ జూలైలో 72,510 కోట్ల డాలర్లకు చేరుకుంది. అంటే, ఏడాది కాలంలో మస్క్ సంపద సగటున రోజుకు 87.5 కోట్ల డాలర్లు, దాదాపు రూ.8,313 కోట్లు పెరిగినట్లు లెక్క. టెస్లా, సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ఎక్స్, అంతరిక్ష సంస్థ స్పేస్‌ఎక్స్‌కు మస్క్ అధిపతిగా ఉన్నారు. జూన్ 12న స్పేస్‌ఎక్స్ షేర్ల లిస్టింగ్ అనంతరం ఆయన వ్యక్తిగత సంపద లక్ష కోట్ల డాలర్లను దాటడంతో ప్రపంచంలో తొలి ట్రిలియనీర్‌గా నిలిచారు.
అయితే, స్పేస్‌ఎక్స్ షేర్ ధరల్లో తీవ్ర హెచ్చుతగ్గులు చోటుచేసుకోవడంతో మస్క్ నెట్‌వర్త్ కూడా ఇటీవలి రోజుల్లో భారీగా మారుతోంది. బ్లూమ్‌బర్గ్ బిలియనీర్స్ ఇండెక్స్ ప్రకారం. గత వారం చివరి నాటికి ఆయన సంపద సుమారు 81,700 కోట్ల డాలర్లుగా నమోదైంది. మస్క్ కంపెనీల విలువల్లో వచ్చే మార్పులు ఆయన మొత్తం సంపదపై ఎంతటి ప్రభావం చూపుతున్నాయో తాజా పరిణామాలు వెల్లడిస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!