
జనరల్

దాదాపు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న బోఫోర్స్ కేసుకు సంబంధించిన చివరి పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేయడంతో ఈ వివాదానికి పూర్తిస్థాయిలో తెరపడింది. హిందూజా సోదరులను నిర్దోషులుగా ప్రకటిస్తూ ఢిల్లీ హైకోర్టు 2005లో ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ అడ్వకేట్ కే. అగ్రవాల్ ఈ పిటిషన్‌ను దాఖలు చేశారు.
జస్టిస్ జేబీ పార్దీవాలా, జస్టిస్ కే. వినోద్ చంద్రన్‌లతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను తిరస్కరించింది. హిందూజా సోదరులను నిర్దోషులుగా ప్రకటించిన ఢిల్లీ హైకోర్టు తీర్పుపై సీబీఐ దాఖలు చేసిన అప్పీల్‌ను కూడా ఇప్పటికే కొట్టివేసిన విషయాన్ని సుప్రీంకోర్టు గుర్తుచేసింది. ఈ పరిస్థితుల్లో కేసును మరింత కొనసాగించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తూ తాజా పిటిషన్‌ను తోసిపుచ్చింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!