

తిరుమలలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరగడంతో తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) అధికారులు ఉచిత సర్వదర్శనం (ఎస్‌ఎస్‌డీ) టోకెన్ల జారీపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రేపటి శ్రీవారి దర్శనానికి ఈరోజు జారీ చేయాల్సిన ఎస్‌ఎస్‌డీ టోకెన్లను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. తిరుమలలోని క్యూ కాంప్లెక్స్‌లు, కంపార్ట్‌మెంట్లు పూర్తిగా నిండిపోవడంతో భక్తుల రద్దీని నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. అయితే శుక్రవారం దర్శనానికి సంబంధించిన టోకెన్లు గురువారం యథావిధిగా జారీ అవుతాయని స్పష్టం చేశారు.
ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా టోకెన్ల జారీ నిలిపివేయడం ఈ నెలలోనే నాలుగోసారి కావడంతో దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు తీవ్ర అసౌకర్యానికి గురయ్యారు. టోకెన్ల కోసం కౌంటర్లకు చేరుకున్న భక్తులు నిరాశతో వెనుదిరిగారు. మరోవైపు మెట్ల మార్గంలో దివ్యదర్శనం టోకెన్లు కూడా గంటలోపే పూర్తవడంతో వేలాది మంది భక్తులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తుల సంఖ్య గణనీయంగా పెరగడమే ఈ పరిస్థితికి ప్రధాన కారణమని టీటీడీ అధికారులు వెల్లడించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!