
రాజకీయాలు

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. రాష్ట్రంలో కొత్తగా మరో 7 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇందులో గుంటూరు జిల్లాలో నాలుగు కేసులు, తూర్పుగోదావరి జిల్లాలో రెండు కేసులు, బాపట్ల జిల్లాలో ఒక కేసు నమోదైనట్లు అధికారులు వెల్లడించారు. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 26కి చేరింది.
కరోనా కారణంగా ఇప్పటివరకు రాష్ట్రంలో నలుగురు మృతి చెందినట్లు సమాచారం. పెరుగుతున్న కేసుల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అవసరమైన జాగ్రత్తలు పాటించాలని వైద్య అధికారులు సూచిస్తున్నారు. కేసుల పరిస్థితిని ఆరోగ్య శాఖ పర్యవేక్షిస్తోంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!