
రాజకీయాలు

ఢిల్లీలో సీజేపీ ఆందోళనలు తీవ్రతరమైన నేపథ్యంలో ఐఐటీ రూర్కీ జారీ చేసిన అడ్వైజరీపై వివాదం నెలకొంది. ప్రస్తుతం కొనసాగుతున్న రాజకీయ ఉద్యమాలకు సోషల్ మీడియా ద్వారా మద్దతు ఇవ్వొద్దని విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి సంస్థ సూచించింది. సంస్థ అనుమతి లేకుండా రాజకీయ చర్చల్లో పాల్గొనడం, రాజకీయ కార్యకలాపాల్లో భాగస్వామ్యం కావడం, విద్యాసంస్థ-ప్రభుత్వ సంబంధాలను ప్రభావితం చేసేలా ప్రకటనలు చేయడం నివారించాలని పేర్కొంది.
ఈ సూచనలపై విమర్శలు వెల్లువెత్తగా, ఐఐటీ రూర్కీ వివరణ ఇచ్చింది. ఇది కొత్త ఆదేశం లేదా విధానం కాదని, ప్రతి విద్యా సంవత్సరం ప్రారంభంలో విద్యార్థులు, సిబ్బందికి ఇచ్చే అంతర్గత సలహా మాత్రమేనని స్పష్టం చేసింది. అడ్వైజరీని తప్పుగా అర్థం చేసుకోవద్దని సంస్థ ప్రతినిధి తెలిపారు.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!