

ఈశాన్య రాష్ట్రాలు, హిమాచల్ ప్రదేశ్, జమ్మూ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలు తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడిన ఘటనల్లో ఆరుగురు మరణించగా, రైలు మార్గాలు, వ్యవసాయ భూములు, ప్రజా సదుపాయాలు దెబ్బతిన్నాయి. హిమాచల్ ప్రదేశ్‌లో మేఘ విస్ఫోటం కారణంగా ఆరు ఇళ్లు కొట్టుకుపోయినా ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. కొండచరియలు విరిగిపడటంతో పాత హిందుస్థాన్–టిబెట్ జాతీయ రహదారిపై రాకపోకలు నిలిచిపోయాయి.
అస్సాంలో వరదల మృతుల సంఖ్య 11కు చేరగా, బ్రహ్మపుత్ర, దిఖో, దేసాంగ్, ధన్సిరి నదులు ప్రమాద స్థాయికి మించి ప్రవహిస్తున్నాయి. సుమారు 758 గ్రామాల్లో 3.10 లక్షల మందికి పైగా ప్రజలు వరదల ప్రభావానికి గురయ్యారు. నాగాలాండ్‌లో వర్షాలు, వరదలు, కొండచరియల కారణంగా మృతుల సంఖ్య తొమ్మిదికి చేరింది. ఉత్తరాఖండ్‌లో భారీ వర్షాలతో నిలిచిపోయిన చార్ధామ్ యాత్రను పరిస్థితులు మెరుగుపడడంతో మంగళవారం తిరిగి ప్రారంభించారు.















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!