

అక్కినేని అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా తెరకెక్కిన ‘లెనిన్’ సినిమా విజయవంతమైన ప్రదర్శనను కొనసాగిస్తోంది. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు రూపొందించిన ఈ మాస్ ఎమోషనల్ యాక్షన్ డ్రామా అఖిల్ కెరీర్‌లో కీలక విజయంగా నిలిచింది. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ మార్కెట్‌లోనూ ఈ చిత్రం స్థిరమైన వసూళ్లను రాబడుతోంది. ముఖ్యంగా నార్త్ అమెరికాలో సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తున్నట్లు ట్రేడ్ వర్గాలు వెల్లడించాయి.
తాజాగా ‘లెనిన్’ నార్త్ అమెరికాలో $800K వసూళ్ల మార్క్‌ను దాటినట్లు చిత్ర బృందం ప్రకటించింది. విడుదలైనప్పటి నుంచి నిలకడైన కలెక్షన్లతో ముందుకు సాగుతున్న ఈ చిత్రం మరిన్ని మైలురాళ్లు అందుకునే అవకాశం ఉందని ట్రేడ్ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అఖిల్ నటన, భావోద్వేగాలతో కూడిన కథనం, యాక్షన్ అంశాలు ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయని చెబుతున్నారు. థమన్ సంగీతం సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచిందని, నిర్మాణ విలువలు కూడా ప్రశంసలు అందుకుంటున్నాయని పేర్కొన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!