

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన ‘ఓజీ’, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన ‘దేవర’ సినిమాలు థియేటర్లతో పాటు ఓటీటీలోనూ మంచి ఆదరణ అందుకున్నాయి. అయితే టెలివిజన్ ప్రీమియర్ విషయంలో మాత్రం రెండు చిత్రాల మధ్య తేడా కనిపిస్తోంది. ముందుగా విడుదలైన ‘దేవర’ టీవీ ప్రసారంపై ఇప్పటివరకు అధికారిక ప్రకటన రాలేదు. మరోవైపు తర్వాత వచ్చిన ‘ఓజీ’ మాత్రం త్వరలోనే బుల్లితెరపై సందడి చేయడానికి సిద్ధమవుతోంది.
‘ఓజీ’ శాటిలైట్ హక్కులను ఈటీవీ సొంతం చేసుకోగా, త్వరలో టెలికాస్ట్ చేయనున్నట్లు ప్రకటించింది. ‘దేవర’ శాటిలైట్ హక్కులు కూడా అదే ఛానెల్ వద్ద ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నప్పటికీ, ప్రసార తేదీపై ఇంకా స్పష్టత లేదు. థియేటర్ల నుంచి ఓటీటీ వరకు వేగంగా వచ్చిన ‘దేవర’ టీవీ ప్రీమియర్‌లో ఆలస్యం ఎందుకు జరుగుతోందనే చర్చ అభిమానుల్లో మొదలైంది. ‘ఓజీ’ టీవీలోకి వస్తుండటంతో ‘దేవర’ ప్రసార తేదీపై ఆసక్తి మరింత పెరిగింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!