

తమిళ నటుడు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ నటించిన చివరి చిత్రం ‘జన నాయగన్’ జులై 23న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. పలుమార్లు వాయిదా పడిన ఈ సినిమా సెన్సార్, న్యాయపరమైన ప్రక్రియలను పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమైంది. దర్శకుడు హెచ్. వినోద్ ఈ చిత్రాన్ని విజయ్ రాజకీయ ప్రయాణానికి కొత్త గుర్తింపునిచ్చే సినిమాగా అభివర్ణించారు. ప్రపంచవ్యాప్తంగా 30 దేశాల్లో సుమారు 8,000 స్క్రీన్లలో విడుదల కానున్న ఈ చిత్రం అడ్వాన్స్ బుకింగ్స్‌లోనే రూ.15.22 కోట్ల వసూళ్లు సాధించినట్లు సమాచారం.
‘భగవంత్ కేసరి’ మూలకథ ఆధారంగా విజయ్ ఇమేజ్‌కు తగ్గట్టుగా మార్పులు చేసి ఈ చిత్రాన్ని రూపొందించినట్లు దర్శకుడు తెలిపారు. ఉక్రెయిన్-రష్యా డ్రోన్ వార్ అంశాలను కథలో చేర్చి యాక్షన్ సన్నివేశాలను భారీగా తెరకెక్కించినట్లు వెల్లడించారు. విజయ్ సరసన పూజా హెగ్డే నటిస్తున్న ఈ చిత్రంలో ప్రత్యేక అతిథి పాత్రల్లో లోకేష్ కనగరాజ్, అట్లీ, నెల్సన్ దిలీప్‌కుమార్ కనిపించనున్నారు. క్లైమాక్స్‌లోని కొన్ని భాగాలకు విజయ్ స్వయంగా దర్శకత్వం వహించినట్లు సమాచారం. ‘A’ సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం 183 నిమిషాల నిడివితో తెలుగు, హిందీ భాషల్లోనూ విడుదల కానుంది.












కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!