
ఓటీటీ

ఉక్రెయిన్‌తో కొనసాగుతున్న యుద్ధంలో రష్యా తరఫున పోరాడిన ఉత్తరకొరియా సైనికుల్లో సుమారు 2,300 మంది మరణించినట్లు బ్రిటిష్ ప్రసార సంస్థ వెల్లడించింది. ఉపగ్రహ చిత్రాలు, ఉత్తరకొరియా రాజధానిలో ఏర్పాటు చేసిన స్మారక చిహ్నాల ఆధారంగా ఈ అంచనాలు వెలువడ్డాయి. గతంలోనే దక్షిణ కొరియా, రష్యాకు ఉత్తరకొరియా కనీసం 11 వేల మంది సైనికులను పంపినట్లు పేర్కొంది.
ఉక్రెయిన్‌లోని కుర్క్స్ ప్రాంతంలో 2024 ఆగస్టులో జరిగిన యుద్ధంలో ఉత్తరకొరియా సైనికులు పాల్గొన్నట్లు సమాచారం. యుద్ధంలో మరణించిన సైనికుల జ్ఞాపకార్థం ప్రత్యేక మ్యూజియం నిర్మించాలని ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ ఆదేశించినట్లు తెలుస్తోంది. ఆ నిర్మాణ పనులు, స్మారక చిత్రాలను విశ్లేషించి మరణాల సంఖ్యను అంచనా వేసినట్లు నివేదిక వెల్లడించింది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!