
టెక్నాలజీ

ఎఫ్‌సీఆర్‌ఏ (విదేశీ విరాళాల నియంత్రణ) సవరణ బిల్లు-2026పై మరింత లోతైన పరిశీలన కోసం జాయింట్ పార్లమెంటరీ కమిటీ (జేపీసీ)కి పంపేందుకు లోక్‌సభలో తీర్మానం ఆమోదమైంది. ప్రతిపాదిత జేపీసీలో మొత్తం 31 మంది సభ్యులు ఉండనుండగా.. 21 మంది లోక్‌సభ నుంచి, 10 మంది రాజ్యసభ నుంచి సభ్యులు ఉండనున్నారు.
విపక్షాలు, స్వచ్ఛంద సంస్థలు, క్రైస్తవ సంఘాలు సహా పలు వర్గాల నుంచి వచ్చిన అభ్యంతరాలు, విజ్ఞప్తుల నేపథ్యంలో బిల్లును జేపీసీ పరిశీలనకు పంపాలని నిర్ణయించారు. బిల్లుపై సమగ్రంగా అధ్యయనం చేసి, శీతాకాల సమావేశాల్లో నివేదిక సమర్పించాలని కమిటీకి సూచించినట్లు సమాచారం.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!