
జనరల్

భారత్ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆగస్టు 14న సాయంత్రం 7 గంటలకు జాతినుద్దేశించి ప్రసంగించనున్నారు. రాష్ట్రపతి ప్రసంగం ఆకాశవాణి జాతీయ నెట్‌వర్క్‌లో ప్రసారం కానుండగా, దూరదర్శన్ అన్ని ఛానెళ్లలో టెలికాస్ట్ చేయనున్నారు. ముందుగా హిందీలో, అనంతరం ఆంగ్లంలో ప్రసారం చేయనున్నారు.
హిందీ, ఆంగ్ల ప్రసారాల అనంతరం దూరదర్శన్ ప్రాంతీయ ఛానెళ్లలో వివిధ ప్రాంతీయ భాషల్లో ప్రసారం అందుబాటులో ఉంటుంది. ఆకాశవాణి ప్రాంతీయ నెట్‌వర్క్‌లలో రాత్రి 9.30 గంటలకు ప్రాంతీయ భాషా వెర్షన్లను ప్రసారం చేయనుంది. దేశ ప్రగతి, సాధించిన విజయాలు, ఎదురవుతున్న సవాళ్లు, భవిష్యత్ ఆకాంక్షలపై రాష్ట్రపతి సందేశం ఉండే అవకాశం ఉంది.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!