

తెలంగాణ పాడి రైతులకు మెరుగైన మార్కెట్ అవకాశాలు కల్పించడంతోపాటు రాష్ట్రంలో డెయిరీ ప్రాసెసింగ్ రంగాన్ని బలోపేతం చేయడంలో సాబర్ (అమూల్) డెయిరీ మెగా ఇంటిగ్రేటెడ్ డెయిరీ ప్లాంట్ కీలకంగా నిలుస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్‌లోని ఊర్జా ఇండస్ట్రియల్ పార్క్‌లో రూ.400 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేస్తున్న ప్లాంట్‌కు భూమిపూజ చేసిన అనంతరం ఆయన మాట్లాడారు. ఇన్వెస్ట్ తెలంగాణ, తెలంగాణ రైజింగ్-2047 లక్ష్యాల నేపథ్యంలో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామికవేత్తల్లో పెరుగుతున్న విశ్వాసానికి ఈ ప్రాజెక్టు నిదర్శనమని పేర్కొన్నారు.
ప్రారంభంలో రోజుకు ఐదు లక్షల లీటర్ల పాల ప్రాసెసింగ్ సామర్థ్యంతో ప్లాంట్‌ను ఏర్పాటు చేస్తున్నామని, దీనివల్ల ప్రత్యక్షంగా సుమారు 350 మందికి ఉపాధి లభించడంతోపాటు పాల సేకరణ, రవాణా, ప్రాసెసింగ్, పంపిణీ తదితర కార్యకలాపాల ద్వారా దాదాపు 10 వేల మంది పాడి రైతులకు ప్రయోజనం చేకూరుతుందని శ్రీధర్‌బాబు తెలిపారు. ప్లాంట్‌లో పాలు, పెరుగు, పనీర్, ఐస్‌క్రీమ్, లస్సీ, నెయ్యి, మజ్జిగ, బేకరీ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా రైతులకు విస్తృత మార్కెట్ అవకాశాలు లభిస్తాయని చెప్పారు. పాల సేకరణ నుంచి కోల్డ్ చెయిన్, ప్యాకేజింగ్, పంపిణీ, రిటైల్, అనుబంధ సేవల వరకు పూర్తిస్థాయి డెయిరీ వ్యవస్థ అభివృద్ధికి ఈ ప్రాజెక్టు దోహదపడుతుందని పేర్కొన్నారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!