
సినిమాలు

అక్వాన్ తుపాన్ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ యంత్రాంగం అప్రమత్తమైంది. తుపాన్‌ను సమర్థంగా ఎదుర్కొనేందుకు అవసరమైన అన్ని ముందస్తు చర్యలు చేపట్టాలని రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు. రెవెన్యూ సిబ్బంది తమ సెలవులను రద్దు చేసుకుని విధులకు అందుబాటులో ఉండాలని సూచించారు.
తుపాన్ ప్రభావంతో కోస్తా తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని మంత్రి తెలిపారు. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల్లో నివసించే ప్రజల భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని, అవసరమైన సహాయక చర్యలు ముందుగానే సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. తుపాన్ పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.


కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!