

సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ హెచ్‌ఎంఎస్ గౌరవ అధ్యక్షురాలు, తెలంగాణ రక్షణ సేన చీఫ్ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని సింగరేణి భవన్ వద్ద నిరసన చేపట్టారు. సింగరేణి లాభాల్లో కార్మికులకు 35 శాతం వాటా చెల్లించాలని, మెడికల్ బోర్డుకు దరఖాస్తు చేసుకున్న అర్హులైన కార్మికుల సమస్యలను పరిష్కరించాలని ఆమె డిమాండ్ చేశారు. మెడికల్ బోర్డును నెలకు రెండుసార్లు నిర్వహించాలని, అలియాస్ పేర్ల సమస్యను పరిష్కరించాలని, జూనియర్ అసిస్టెంట్ ఖాళీలను భర్తీ చేయాలని కోరారు.
విజిలెన్స్ కారణంగా నిలిచిపోయిన డిపెండెంట్ ఉద్యోగాలను కల్పించాలని, ప్రతి కార్మికుడికి సొంతింటి పథకం కోసం రెండు గుంటల భూమి ఇవ్వాలని కవిత డిమాండ్ చేశారు. సింగరేణికి కొత్త బొగ్గు బ్లాకులు కేటాయించాలని, కార్మికులకు ఆదాయపు పన్ను రద్దు చేయాలని, కాంట్రాక్ట్ కార్మికులకు హైపవర్ కమిటీ సిఫార్సుల మేరకు వేతనాలు చెల్లించాలని కోరారు. ప్రభుత్వం సింగరేణికి బకాయిలుగా ఉన్న రూ.62 వేల కోట్లను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. సింగరేణి కార్మికుల సంక్షేమం, డిపెండెంట్ ఉద్యోగాలు, మెడికల్ బోర్డు తదితర అంశాలపై కవిత గతంలోనూ పలు డిమాండ్లు చేశారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!