
సినిమాలు

గుజరాత్‌లో కుండపోత వర్షాలు బీభత్సం సృష్టించాయి. వల్సాద్ జిల్లాలోని ఉంబెర్‌గావ్ తాలూకాలో కేవలం 16 గంటల్లోనే 1,100 మి.మీ వర్షపాతం నమోదై రికార్డు సృష్టించింది. సమీప ప్రాంతాల్లో కూడా 600 మి.మీకి పైగా వర్షం కురవడంతో రహదారులు జలమయమయ్యాయి. పలు ప్రాంతాల్లో రాకపోకలు నిలిచిపోయి సాధారణ జీవనం తీవ్రంగా దెబ్బతింది.
సూరత్, నవ్‌సారీ, డాంగ్స్, తాపి, వల్సాద్ జిల్లాలకు భారత వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మరిన్ని భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. వాపి, పరిసర ప్రాంతాల్లో వందలాది వాహనాలు, ఇళ్లు వరద నీటిలో చిక్కుకోగా, పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు అధికారులు, సహాయక బృందాలు అప్రమత్తంగా పనిచేస్తున్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!