

రాయలసీమ ఇకపై దేశ రక్షణ రంగంలో కీలక కేంద్రంగా మారబోతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తిలో అత్యాధునిక యుద్ధ విమానాల తయారీకి సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శంకుస్థాపన జరగనుంది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తో కలిసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. సుమారు రూ.15,803 కోట్ల వ్యయంతో 650 ఎకరాల్లో ఈ ప్రాజెక్టు నిర్మించబడనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా అత్యాధునిక సాంకేతికతతో యుద్ధ విమానాల అభివృద్ధి, పరీక్షలు చేపట్టనున్నారు.
ఈ ప్రధాన ప్రాజెక్టుతో పాటు రక్షణ, డ్రోన్ రంగాలకు చెందిన మరో 12 ప్రాజెక్టులకు కూడా భూమి పూజ జరగనుంది. వీటి ద్వారా రూ.4,145 కోట్ల పెట్టుబడులు, ఆరు వేలకుపైగా ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. కర్నూలులో ఏర్పాటు చేస్తున్న డ్రోన్ నగరం దేశంలోనే అత్యుత్తమ డ్రోన్ వ్యవస్థగా అభివృద్ధి చెందనుంది. రాయలసీమతో పాటు ప్రకాశం జిల్లాలో కూడా భారీ పెట్టుబడులు రానుండటంతో ఈ ప్రాంతం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి చెందనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!