
బిజినెస్

బయట ఆహారం తీసుకునే వారికి ఐఏఎస్ అధికారి తుకారాం ముండే నాలుగు కీలక సూచనలు చేశారు. ఆహారం విక్రయించే ప్రదేశంలో పరిశుభ్రత ఎలా ఉందో పరిశీలించాలని, రెస్టారెంట్‌కు చెల్లుబాటు అయ్యే లైసెన్స్ ఉందో లేదో తనిఖీ చేయాలని సూచించారు. అలాగే వయసు, ఆరోగ్య పరిస్థితులకు అనుగుణంగా ఆహారాన్ని ఎంచుకోవాలని, కొవ్వు, చక్కెర, ఉప్పు తక్కువగా ఉన్న పదార్థాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలిపారు.
స్ట్రీట్ ఫుడ్, బయట తినే ఆహారం సంస్కృతి పెరుగుతున్న నేపథ్యంలో రుచి కంటే ఆరోగ్యం, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరం ఉందని ఆయన సూచనలు గుర్తు చేస్తున్నాయి. ఆహారం తీసుకునే ముందు పరిశుభ్రత, ఆహార భద్రతా ప్రమాణాలు, పోషక విలువలను పరిశీలించడం ద్వారా ఆరోగ్య సమస్యల ముప్పును తగ్గించుకోవచ్చు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!