
జనరల్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు నీటిపారుదల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడుతో సమావేశమై రాష్ట్రంలో ఏర్పడే సూపర్ ఎల్‌నినో పరిస్థితులు, సాగునీటి సమస్యలపై చర్చించారు. రైతులతో ప్రత్యక్ష సమావేశాలు నిర్వహించి ఎల్‌నినో ప్రభావంపై అవగాహన కల్పించాలని, నీటి సంక్షోభాన్ని ఎదుర్కొనే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి పెట్టాలని పవన్ సూచించారు.
ఏలేరు ప్రాజెక్టు నుంచి 1,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేసినందుకు మంత్రి నిమ్మలకు పవన్ కృతజ్ఞతలు తెలిపారు. దీంతో పిఠాపురం, పెద్దాపురం, జగ్గంపేట రైతులకు ఊరట లభించిందన్నారు. ప్రతి రైతు పీఎం ఫసల్ బీమా యోజనలో చేరేలా అవగాహన కల్పించాలని, నీటి వృథాను అరికట్టడం, కాలువల పూడిక తొలగించడం, లీకేజీల నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా భుజం శస్త్రచికిత్స చేయించుకున్న పవన్‌ను మంత్రి నిమ్మల పరామర్శించారు.














కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!