

ప్రస్తుతం రసాయన కాలుష్యం, మొబైల్ ఫోన్లు, స్క్రీన్ల అధిక వినియోగం, నిద్రలేమి వంటి కారణాలతో కంటి ఆరోగ్యంపై ప్రభావం పడే అవకాశం ఉంది. రెటీనా ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్లు, జింక్, లూటిన్, జియాక్సాంతిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ ఏ వంటి పోషకాలు కీలక పాత్ర పోషిస్తాయి. అవిసె గింజలు ఒమేగా-3కు మంచి వనరుగా ఉండగా, గుమ్మడి గింజలు, జనపనార విత్తనాలు జింక్, లూటిన్, జియాక్సాంతిన్ వంటి పోషకాలను అందిస్తాయి.
విటమిన్ సి, విటమిన్ ఇ కంటి కణాలను ఆక్సీకరణ ఒత్తిడి నుంచి రక్షించడంలో, కణాల ఆరోగ్యాన్ని కాపాడడంలో సహాయపడతాయి. పొద్దుతిరుగుడు గింజల్లో విటమిన్ ఇ, జామ, ఉసిరిలో విటమిన్ సి లభిస్తాయి. ఇక విటమిన్ ఏ సాధారణ దృష్టి, రంగులను గుర్తించడం, రేచీకటిని నివారించడంలో అవసరం కాగా.. మునగాకు, కరివేపాకు, కొత్తిమీర వంటి ఆకుకూరలు దానికి మంచి వనరులు. పోషకాహారంతో పాటు రోజుకు 7–8 గంటల నిద్ర, స్క్రీన్ వినియోగంలో విరామాలు, కళ్లకు తగిన విశ్రాంతి ఇవ్వడం కూడా ముఖ్యమే.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!