
ఆరోగ్యం

సమ్మిళితాభివృద్ధి లక్ష్యంగా సదస్సులో కీలక అంశాలపై చర్చలు జరిగాయని ప్రధాని నరేంద్ర మోదీ తెలిపారు. కొత్త సాంకేతిక ఆవిష్కరణలను అన్ని దేశాలు అందిపుచ్చుకోవాలని, సమిష్టి కృషి, పరస్పర ప్రయోజనాలతో ప్రతి ఒక్కరికీ సమాన ప్రయోజనాలు అందేలా చూడాలని ఆయన అన్నారు.
ఘర్షణలు, వివాదాలు, వైరుద్ధ్యాలు, యుద్ధాల ప్రభావాన్ని పరిమితం చేసుకోవాల్సిన అవసరం ఉందని మోదీ పేర్కొన్నారు. ఏ సంక్షోభం కూడా ఒక్క ప్రాంతానికే పరిమితం కావడం లేదని, ప్రపంచ దేశాలు సమష్టిగా పనిచేయాల్సిన అవసరం ఉందని అన్నారు. భవిష్యత్ తరాల అవసరాలకు ప్రాధాన్యం ఇస్తూ అభివృద్ధి దిశగా ముందుకు సాగాలని పిలుపునిచ్చారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!