
జనరల్

కృష్ణా జిల్లా ఉంగుటూరు మండలం తేలప్రోలు సమీపంలోని జాతీయ రహదారి-16పై తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చెన్నై నుంచి విశాఖపట్నం వైపు సుమారు 26 మంది ప్రయాణికులతో వెళ్తున్న వైబీఎం ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి రోడ్డుమధ్యలో ఉన్న డివైడర్‌పై బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సుమారు 12 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడగా, మరికొందరికి స్వల్ప గాయాలయ్యాయి.
ప్రమాదం జరిగిన సమయంలో బస్సు వెనుక వస్తున్న ఓ లారీ బస్సును తప్పించుకునే ప్రయత్నంలో ఢీకొనడంతో లారీ డ్రైవర్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులందరినీ అంబులెన్సుల ద్వారా అవుటపల్లిలోని పిన్నమనేని సిద్ధార్థ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న గన్నవరం డీఎస్పీ ధర్మేంద్ర, ఆత్కూరు పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టడంతో పాటు క్షతగాత్రులను పరామర్శించారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!