
బిజినెస్

నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో రేపు సూర్యాపేట జిల్లా కోదాడలో మెగా జాబ్‌మేళా నిర్వహిస్తున్నట్లు మంత్రి ఎన్. ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. ఈ జాబ్‌మేళాకు రాష్ట్రవ్యాప్తంగా 300 ప్రముఖ కంపెనీలు హాజరుకానున్నాయని, నిరుద్యోగులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. జాబ్‌మేళాకు సుమారు 20 వేల మంది హాజరయ్యే అవకాశం ఉందని, 3 వేల మందికి పైగా ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని తెలిపారు.
ఈ జాబ్‌మేళాకు 18 నుంచి 35 ఏళ్లలోపు వయసున్న యువతీ, యువకులు మాత్రమే హాజరు కావాలని మంత్రి సూచించారు. ఉద్యోగాల కోసం ఆసక్తి ఉన్న అభ్యర్థులు ముందుగా వెబ్‌సైట్ ద్వారా అవసరమైన వివరాలను తెలుసుకోవచ్చు. జాబ్‌మేళాకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం www.kodadmegajobmela.com వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!