

టాలీవుడ్ హీరో నాని తమిళనాడు సీఎం విజయ్ రాజకీయ ప్రయాణంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘ది ప్యారడైజ్’ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా చెన్నైలో నిర్వహించిన ప్రెస్‌మీట్‌లో ఆయన విజయ్ గురించి మాట్లాడారు. విజయ్ క్రేజ్ కేవలం ఆయన సినీ స్టార్‌డమ్, బాక్సాఫీస్ విజయాలకు మాత్రమే పరిమితం కాదని నాని అన్నారు. తమిళనాడు ప్రజలు ఎన్నో ఏళ్లుగా విజయ్‌పై నమ్మకాన్ని పెంచుకున్నారని, ఆయనను తమ కుటుంబంలో ఒకరిగా భావిస్తున్నారని చెప్పారు. సోషల్ మీడియాలో విజయ్ అసెంబ్లీకి సంబంధించిన వీడియోలు చూశానని, ఆయన అసెంబ్లీలో ‘అదరగొడుతున్నారని’ అనిపించిందని నాని పేర్కొన్నారు. రాబోయే రోజుల్లోనూ ఆయన పాలన విజయవంతంగా కొనసాగాలని ఆకాంక్షించారు.
ఇదే ప్రెస్‌మీట్‌లో నాని తన సినిమాలను ‘పాన్ ఇండియా’ చిత్రాలుగా పిలవడం తనకు నచ్చదని తెలిపారు. బాలీవుడ్ సినిమా విజయం సాధిస్తే దాన్ని సాధారణంగా హిందీ సినిమాగానే పేర్కొంటారని, అదే దక్షిణాది సినిమా విజయం సాధించినప్పుడు ‘పాన్ ఇండియా’ అనే లేబుల్ వేస్తారని అన్నారు. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ది ప్యారడైజ్ సెప్టెంబర్ 24, 2026న ప్రేక్షకుల ముందుకు రానుంది.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!