
జనరల్

తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనానికి ప్రస్తుతం సుమారు 8 గంటల సమయం పడుతోంది. గురువారం సాయంత్రం 5 గంటల వరకు ఉన్న సమాచారం ప్రకారం, వైకుంఠం క్యూకాంప్లెక్స్-2లోని 25 కంపార్టుమెంట్లలో సర్వదర్శనం భక్తులు, వైకుంఠం క్యూకాంప్లెక్స్-1లోని 4 కంపార్టుమెంట్లలో టైంస్లాట్ భక్తులు వేచి ఉన్నారు.
మంగళవారం శ్రీవారి హుండీ ద్వారా రూ.2.46 కోట్ల ఆదాయం లభించింది. బుధవారం మొత్తం 71,196 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. అదే రోజు 22,581 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో దర్శనానికి ఎక్కువ సమయం పడుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!