

రేణిగుంట రైల్వే స్టేషన్‌లో టికెట్ విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. కేరళ ఎక్స్‌ప్రెస్‌లో సాధారణ టికెట్‌తో రిజర్వేషన్ బోగీలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తిని టికెట్ కలెక్టర్ దించినట్లు సమాచారం. అనంతరం తన సమస్యపై రైల్వే హెల్ప్‌లైన్‌కు ఫోన్ చేసినప్పటికీ స్పందన లభించలేదని భావించిన ఆ ప్రయాణికుడు మనస్తాపానికి గురైనట్లు తెలుస్తోంది.
దీంతో అతడు రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జిపైకి ఎక్కి హైటెన్షన్ విద్యుత్ వైర్ల వైపు వెళ్లేందుకు ప్రయత్నించినట్లు సమాచారం. విషయం గుర్తించిన రైల్వే అధికారులు వెంటనే విద్యుత్ సరఫరాను నిలిపివేశారు. సమాచారం అందుకున్న GRP, RPF, ఫైర్ సిబ్బంది ఘటనాస్థలికి చేరుకుని ప్రయాణికుడిని సురక్షితంగా కిందకు తీసుకురావడానికి చర్యలు చేపట్టారు. విద్యుత్ సరఫరా నిలిపివేయడంతో పాటు సిబ్బంది సమన్వయంతో పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటన కారణంగా గంటల తరబడి రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడి ప్రయాణికులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!