
క్రీడలు

నేడు రాష్ట్రపతి భవన్‌లో పద్మ అవార్డుల ప్రదానోత్సవం రెండు దశల్లో నిర్వహించబడుతోంది. మొదటి దశలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము 66 మందికి పద్మ పురస్కారాలను అందజేయనున్నారు. వీటిలో 2 పద్మవిభూషణ్, 6 పద్మభూషణ్, 58 పద్మశ్రీ పురస్కారాలు ఉన్నాయి. వివిధ రంగాల్లో విశిష్ట సేవలందించిన వారికి ఈ గౌరవాలు ప్రదానం చేయబడుతున్నాయి.
2026 సంవత్సరానికి కేంద్ర ప్రభుత్వం మొత్తం 131 పద్మ పురస్కారాలను ప్రకటించింది. వీటిలో 5 పద్మవిభూషణ్, 13 పద్మభూషణ్, 113 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. కళలు, సాహిత్యం, విద్య, వైద్యం, క్రీడలు, సామాజిక సేవ వంటి రంగాల్లో విశేష కృషి చేసిన వారికి పద్మ అవార్డులు దేశ అత్యున్నత పౌర పురస్కారాల్లో ఒకటిగా ప్రాధాన్యం కలిగి ఉన్నాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!