

ఎడతెరిపి లేకుండా కురిసిన భారీ వర్షాల కారణంగా ఇటీవల ప్రారంభించిన ముంబై–పూణే ఎక్స్‌ప్రెస్‌వే మిస్సింగ్ లింక్‌పై కొండచరియలు విరిగిపడి ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. తొలి సొరంగం సమీపంలోని రిటైనింగ్ వాల్ దెబ్బతినడంతో మట్టి, రాళ్లు, నీరు రోడ్డుపైకి చేరాయి. దీంతో పూణే నుంచి ముంబై వైపు వెళ్లే మార్గాన్ని అధికారులు వెంటనే మూసివేసి, వాహనాలను పాత ముంబై–పూణే జాతీయ రహదారిపైకి మళ్లించారు.
రూ.6,695 కోట్ల వ్యయంతో నిర్మించిన ఈ మిస్సింగ్ లింక్ ప్రాజెక్టును మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఈ ఏడాది మే 1న ప్రారంభించారు. ఖండాల ఘాట్‌లో ప్రమాదాలను తగ్గించి, ప్రయాణ సమయాన్ని తగ్గించడమే ఈ ప్రాజెక్టు ప్రధాన లక్ష్యం. ప్రస్తుతం దెబ్బతిన్న ప్రాంతంలో మరమ్మతు పనులు కొనసాగుతుండగా, పూర్తిస్థాయిలో ట్రాఫిక్ పునరుద్ధరణకు ముందు అధికారులు భద్రతా తనిఖీలు నిర్వహిస్తున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!