
సినిమాలు

తెలంగాణ మంత్రి కొండా సురేఖ ఎమ్మెల్యే కడియం శ్రీహరిపై చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డికి మూడు పేజీల లేఖ రాశారు. తనకు సమాచారం ఇవ్వకుండా దేవాదాయ శాఖ అధికారులతో కడియం శ్రీహరి సమీక్ష నిర్వహించడం శాఖ పరిపాలనలో అనవసర జోక్యమని ఆమె పేర్కొన్నారు.
ఈ వ్యవహారం ప్రభుత్వ పరిపాలనా వ్యవస్థ విశ్వసనీయతకు సంబంధించిన అంశమని కొండా సురేఖ లేఖలో పేర్కొన్నారు. ఇది రూల్స్ ఆఫ్ బిజినెస్‌కు విరుద్ధమని ఆరోపిస్తూ క్రమశిక్షణ కమిటీతో విచారణ జరిపించాలని, మంత్రుల రాజ్యాంగబద్ధ అధికారాలను గౌరవించేలా కడియం శ్రీహరికి తగిన మార్గదర్శకాలు జారీ చేయాలని ముఖ్యమంత్రిని కోరారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!