

బుల్లితెరలో అత్యంత ప్రజాదరణ పొందిన రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ 10కు రంగం సిద్ధమవుతోంది. ఆగస్టు చివరి వారం లేదా సెప్టెంబర్ తొలి వారంలో షో ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 'అగ్నిపరీక్ష సీజన్ 2' పేరుతో డిజిటల్ ఆడిషన్స్ కొనసాగుతుండగా, నాగార్జునతో విడుదలైన తాజా ప్రోమో షోపై మరింత ఆసక్తిని పెంచింది. ఈసారి కూడా సామాన్యులకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.
సోషల్ మీడియా ప్రచారం ప్రకారం నిఖిల్ విజయేంద్ర సింహా, తేజస్వీ గౌడ, పల్లవి రామిశెట్టి, పల్లవి గౌడ, హరి, వర్ష, దీపికతో పాటు 'కుక్ విత్ జాతి రత్నాలు' షోకు చెందిన పలువురు కంటెస్టెంట్లుగా హౌస్‌లోకి అడుగుపెట్టే అవకాశముందని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే దీనిపై అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు. ఇదే సమయంలో సీజన్ 10 కోసం నాగార్జునకు సుమారు రూ.40 కోట్ల పారితోషికం అందనున్నట్లు ప్రచారం జరుగుతోంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!