
సినిమాలు

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జమ్మూ-కశ్మీర్‌లో శుక్రవారం ప్రారంభమైన వార్షిక అమర్‌నాథ్ యాత్ర సందర్భంగా భక్తులకు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ పవిత్ర యాత్రను ఒక గొప్ప భాగ్యంగా అభివర్ణించిన ప్రధాని, భక్తిశ్రద్ధలు, క్రమశిక్షణ, బాధ్యతాయుతమైన జాతీయ భావనతో యాత్రను కొనసాగించాలని సూచించారు. శివభక్తులను ఉద్దేశించి రాసిన సందేశాన్ని ఎక్స్ వేదికలో పంచుకుంటూ యాత్ర విజయవంతంగా సాగాలని ఆకాంక్షించారు.
ప్రతి ఏడాది మంచు లింగ రూపంలో వెలిసే ‘బాబా బర్ఫానీ’ దర్శనం లక్షలాది మంది భక్తులకు అత్యంత పవిత్రమైన, మరపురాని అనుభూతిని కలిగిస్తుందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ఏడాది అమర్‌నాథ్ యాత్రలో పాల్గొనే ప్రతి భక్తుడికి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తూ, యాత్రను సురక్షితంగా, ప్రశాంతంగా పూర్తి చేసుకోవాలని ఆకాంక్షించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!