
జనరల్

ఎఫ్‌ఐహెచ్ మహిళల హాకీ వరల్డ్‌కప్‌లో భారత మహిళల జట్టు సత్తా చాటింది. పూల్-డీలో జరిగిన రెండో మ్యాచ్‌లో దక్షిణాఫ్రికాను 6-1 గోల్స్ తేడాతో ఓడించింది. ఈ విజయంతో మహిళల హాకీ వరల్డ్‌కప్ చరిత్రలో భారత్ తన అతిపెద్ద విజయాన్ని నమోదు చేసింది.
భారత్ తరఫున సునెలిత టోప్పో 11వ నిమిషంలో తొలి గోల్ చేయగా, నవనీత్ కౌర్, సుశీలా చాను, దీపిక, లాల్‌రెమ్సియామి, సాక్షి రాణా ఒక్కో గోల్ సాధించారు. దక్షిణాఫ్రికా ఒక గోల్ చేసినప్పటికీ.. భారత్ ఆధిపత్యాన్ని కొనసాగిస్తూ 6-1తో మ్యాచ్‌ను ముగించింది. ఈ విజయంతో భారత్ నాకౌట్ దశపై ఆశలను మరింత పెంచుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!