

భోగాపురంలోని అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవం అనంతరం జరిగిన బహిరంగ సభలో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ, ఈ విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి నూతన అధ్యాయమని అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభమైన రూ.17,435 కోట్ల అభివృద్ధి పనులు రహదారి అనుసంధానాన్ని మెరుగుపరచడంతో పాటు పారిశ్రామిక రంగానికి అవసరమైన సప్లై చైన్‌ను బలోపేతం చేసి, భారీ స్థాయిలో ఉపాధి అవకాశాలను కల్పిస్తాయని పేర్కొన్నారు. ఎన్టీపీసీ గ్రీన్ హైడ్రోజన్ హబ్, సౌత్ కోస్ట్ రైల్వే జోన్, అమరావతి, రాయలసీమ అభివృద్ధి ప్రాజెక్టులు రాష్ట్ర భవిష్యత్తును బలోపేతం చేస్తాయని అన్నారు.
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వాన్ని ప్రశంసించిన పవన్ కళ్యాణ్, వికసిత్ భారత్, ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యాలతో దేశం వేగంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. విదేశీ పెట్టుబడులు, విదేశీ మారక నిల్వలు గణనీయంగా పెరిగాయని పేర్కొంటూ, దేశ అభివృద్ధికి ప్రజలంతా అండగా నిలవాలని పిలుపునిచ్చారు. యువతలో దేశభక్తి, క్రమశిక్షణ, విలువలను పెంపొందించడం తల్లిదండ్రుల బాధ్యత అని పేర్కొంటూ, బలమైన నాయకత్వం మరియు మౌలిక వసతుల అభివృద్ధి ద్వారానే రాష్ట్రం, దేశం దీర్ఘకాలిక ప్రగతి సాధిస్తాయని అన్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!