
క్రీడలు

బ్రిక్స్ శిఖరాగ్ర సమావేశంలో భాగంగా నిర్వహించిన విందుకు చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ హాజరుకాలేదు. సుదీర్ఘ ప్రయాణం, టైమ్‌జోన్ మార్పు కారణంగా అలసటకు గురైన నేపథ్యంలో ఆయన విందుకు దూరంగా ఉన్నట్లు సమాచారం. అబుదాబి క్రౌన్ ప్రిన్స్ కూడా విందులో పాల్గొనలేదు. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో పాటు పలువురు కేంద్ర మంత్రులు, ముఖ్యమంత్రులు విందుకు హాజరయ్యారు.
మరోవైపు ప్రధాని నరేంద్ర మోదీ, జిన్‌పింగ్ మధ్య ద్వైపాక్షిక చర్చలు జరిగాయి. భారత్, చైనా మధ్య ఉన్న విభేదాలు వివాదాలుగా మారకుండా చూసుకోవాల్సిన అవసరం ఉందని ఇరువురు నేతలు స్పష్టం చేసినట్లు సమాచారం. ద్వైపాక్షిక సంబంధాలను స్థిరంగా కొనసాగించేందుకు పరస్పర అవగాహన, సహకారం అవసరమని నేతలు పేర్కొన్నారు.



కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!