
షోస్

తెలంగాణ ప్రజలకు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. విఘ్నేశ్వరుడి కృపతో ప్రతి ఒక్కరి జీవితంలోని విఘ్నాలు తొలగి, ప్రజలంతా ఆనందం, ఆరోగ్యంతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. పండగ వేడుకల సందర్భంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.
ముఖ్యంగా హైదరాబాద్‌తో పాటు వివిధ జిల్లా కేంద్రాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే గణేశ్ మండపాల వద్ద పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేయాలని సూచించారు. ఈ ఏడాది గణేశ్ మండపాలకు ప్రభుత్వం ఉచిత విద్యుత్ అందిస్తున్నట్లు రేవంత్‌రెడ్డి తెలిపారు.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!