

ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కొనేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు అధికారులను ఆదేశించారు. తేమ లేమితో ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రతి పంటను రక్షించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అందుబాటులో ఉన్న ప్రతి నీటి వనరును సమర్థంగా వినియోగించాలని, రైతులకు అండగా క్షేత్రస్థాయిలో అధికారులు అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు. రాష్ట్రంలోని 284 మండలాల్లో పంటల పరిస్థితిని నిరంతరం పర్యవేక్షిస్తున్నట్లు తెలిపారు.
రాష్ట్రవ్యాప్తంగా 2.44 లక్షల హెక్టార్లలో పంటలపై ఎల్‌నినో ప్రభావం ఉన్నట్లు మంత్రి పేర్కొన్నారు. పంట రక్షణ చర్యలపై ప్రత్యేక దృష్టి సారించాలని, పంట ఆరోగ్య వివరాల నమోదులో ఉన్న పెండింగ్‌ను వేగంగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. తక్కువ నీటితో సాగు చేసే ప్రత్యామ్నాయ పంటలను పెద్దఎత్తున ప్రోత్సహించాలని, వ్యవసాయ, జలవనరుల శాఖలు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.



















కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!