

వెస్టిండీస్ జట్టు త్వరలో భారత్‌లో పర్యటించనుంది. సెప్టెంబర్ 27 నుంచి మూడు వన్డేలు, అక్టోబర్ 6 నుంచి ఐదు టీ20ల సిరీస్‌లో టీమిండియాతో తలపడనుంది. ఈ సిరీస్‌ల కోసం భారత జట్లను ఎంపిక చేసేందుకు అజిత్ అగార్కర్ నేతృత్వంలోని సీనియర్ సెలక్షన్ కమిటీ బుధవారం దిల్లీలో సమావేశం కానుంది. టీ20లకు ఇప్పటికే ఆసియా క్రీడల కోసం ఎంపిక చేసిన జట్టునే కొనసాగించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే వన్డే సిరీస్ సమయంలోనే ఆసియా క్రీడలు జరగనుండటంతో వన్డే జట్టు ఎంపికపై ఆసక్తి నెలకొంది.
గాయం నుంచి కోలుకుని పూర్తి ఫిట్‌నెస్ సాధించిన హార్దిక్ పాండ్యకు వన్డే జట్టులో చోటు దక్కే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఇండియా-ఎ, ఆస్ట్రేలియా-ఎ మధ్య జరగనున్న మూడు వన్డేల సిరీస్‌కు అతడిని ఎంపిక చేశారు. ఇటీవల టెస్టులకే పరిమితమైన రిషబ్ పంత్ కూడా మళ్లీ వన్డే జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. ఇషాన్ కిషన్ ఆసియా క్రీడల కోసం జపాన్‌కు వెళ్లనున్న నేపథ్యంలో కేఎల్ రాహుల్‌కు బ్యాకప్‌గా పంత్‌ను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒకవేళ ధ్రువ్ జురెల్‌ను సెలక్టర్లు ఎంచుకుంటే.. ఇరానీ కప్‌లో రెస్ట్ ఆఫ్ ఇండియాకు పంత్ నాయకత్వం వహించే అవకాశం ఉంటుంది. శ్రేయస్ అయ్యర్ అందుబాటులో లేకపోవడంతో రుతురాజ్ గైక్వాడ్‌ను నాలుగో స్థానానికి పరిగణించే అవకాశం ఉంది. ఓపెనింగ్‌లో యశస్వి జైస్వాల్, మిడిల్ ఆర్డర్‌లో రజత్ పటిదార్ రిజర్వ్ ఆటగాళ్లుగా ఉండొచ్చు. ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు కూడా సెలక్టర్ల నుంచి పిలుపు వచ్చే అవకాశముంది.

కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!