
జనరల్

పశ్చిమాసియాలో కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో పాకిస్థాన్ సౌదీ అరేబియాకు సుమారు 8 వేల మంది సైనికులను పంపింది. ఇందులో 16 యుద్ధ విమానాలతో కూడిన ఫైటర్ స్క్వాడ్రన్తో పాటు వాయు రక్షణ వ్యవస్థలు కూడా ఉన్నాయని పాక్ ఉన్నతాధికారులు తెలిపారు. ఈ స్క్వాడ్రన్లో అధికంగా చైనాలో తయారైన JF-17 యుద్ధ విమానాలు ఉన్నట్లు సమాచారం. ఈ బలగాలను సౌదీ సరిహద్దుల్లో మోహరించే అవకాశం ఉంది.
ఇరు దేశాల మధ్య గతంలో కుదిరిన రక్షణ ఒప్పందం ఆధారంగా ఈ చర్యలు తీసుకున్నట్లు అధికారులు పేర్కొన్నారు. భవిష్యత్తులో ఇరాన్ నుండి దాడులు జరిగితే వాటిని ఎదుర్కొనేందుకు ఈ మోహరింపు ఉపయోగపడుతుందని చెబుతున్నారు. మరోవైపు అమెరికా–ఇరాన్ ఉద్రిక్తతల మధ్య పాకిస్థాన్ మధ్యవర్తిగా చర్చల్లో పాల్గొంటూ, అదే సమయంలో మిత్రదేశానికి సైన్యాన్ని పంపడం ప్రాధాన్యం సంతరించుకుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!