
జనరల్

సిద్దిపేటలో 6,000 యూరియా బస్తాల అక్రమాలు యూరియా యాప్ ద్వారా వెలుగులోకి వచ్చాయని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. ఈ కేసులో అక్రమాలకు పాల్పడిన డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ వ్యవహారానికి సంబంధించి వ్యవసాయ శాఖకు చెందిన ఒక అధికారిని కూడా సస్పెండ్ చేసినట్లు పేర్కొన్నారు.
యూరియా పంపిణీలో పారదర్శకత తీసుకురావడంలో యూరియా యాప్ కీలక పాత్ర పోషించిందని మంత్రి అన్నారు. యూరియా అక్రమాలను ప్రభుత్వం ఏమాత్రం సహించదని, బాధ్యులపై కఠిన చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో ప్రభుత్వం ఎలాంటి రాజీ పడదని, ఎరువుల పంపిణీని మరింత పారదర్శకంగా కొనసాగిస్తామని తెలిపారు.













కామెంట్స్ (1)
Good job