
జనరల్

134 సినిమాల పాటల యాజమాన్య హక్కులకు సంబంధించిన కాపీరైట్ వివాదంలో ప్రముఖ సంగీత దర్శకుడు ఇళయరాజాకు ఢిల్లీ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. గతంలో జారీ చేసిన మధ్యంతర నిషేధాజ్ఞను ఎత్తివేయాలని ఆయన దాఖలు చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. 134 చిత్రాల పాటల కాపీరైట్ హక్కులు తమవేనని సంగీత సంస్థ సారేగామా వాదించగా, తాను స్వరపరిచిన పాటలపై తనకూ హక్కులు ఉన్నాయని ఇళయరాజా కోర్టుకు తెలిపారు.
ఇరు పక్షాల వాదనలు పరిశీలించిన ఢిల్లీ హైకోర్టు, ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేయాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తుది విచారణ పూర్తై తీర్పు వెలువడే వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న మధ్యంతర ఉత్తర్వులు కొనసాగుతాయని పేర్కొంది. ఈ కేసు తుది తీర్పు సంగీత రంగంలో కాపీరైట్ హక్కుల విషయంలో కీలక ప్రభావం చూపే అవకాశం ఉందని న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!