
రాజకీయాలు

సంధ్య థియేటర్ తొక్కిసలాట కేసులో నేడు నాంపల్లి కోర్టులో కీలక విచారణ జరగనుంది. కమిటల్ బాండ్ ప్రక్రియలో భాగంగా మొత్తం 23 మంది నిందితులు కోర్టుకు హాజరుకావాలని ఆదేశాలు జారీ అయ్యాయి. గత విచారణలో ఇద్దరు నిందితులు గైర్హాజరుకావడంతో కేసు నేటికి వాయిదా పడగా, అల్లు అర్జున్ మాత్రం వర్చువల్‌గా విచారణకు హాజరయ్యారు.
ప్రస్తుతం ముంబైలో ఉన్న అల్లు అర్జున్ మరోసారి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారణకు హాజరయ్యేందుకు కోర్టును ఆశ్రయించారు. అయితే, ఆయనకు వర్చువల్ హాజరుకు అనుమతి ఇవ్వకూడదని ప్రభుత్వ తరపు న్యాయవాది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ పిటిషన్‌పై నేడు నాంపల్లి కోర్టు నిర్ణయం తీసుకునే అవకాశం ఉండగా, ఆ తర్వాత కేసు తదుపరి విచారణ కొనసాగనుంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!