
రాజకీయాలు

దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా తెరకెక్కించాలని భావించిన ప్రతిష్ఠాత్మక పౌరాణిక చిత్రం ‘కర్ణ’లో తొలుత తమిళ స్టార్ సూర్య హీరోగా నటించాల్సి ఉంది. అయితే భారీ బడ్జెట్ కారణంగా ఈ చిత్రం ప్రీ-ప్రొడక్షన్ దశలోనే నిలిచిపోయింది. తాజాగా ఈ ప్రాజెక్ట్ మళ్లీ వార్తల్లోకి రావడంతో సినీ వర్గాల్లో ఆసక్తికర చర్చ మొదలైంది.
తాజా బాలీవుడ్ కథనాల ప్రకారం, ఈ చిత్రంలో కర్ణ పాత్రను సల్మాన్ ఖాన్ పోషించే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై ఆయన సానుకూలంగా స్పందించినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు అధికారిక ప్రకటన వెలువడలేదు. ఒకవేళ ఈ సినిమా కార్యరూపం దాల్చితే, మహాభారతంలోని అత్యంత శక్తివంతమైన పాత్రల్లో ఒకటైన కర్ణగా సల్మాన్ ఖాన్‌ను చూడనున్నారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!