

తమిళ నటుడు సూర్యతో దర్శకుడు రాకేష్ ఓంప్రకాష్ మెహ్రా రూపొందించాలని భావించిన కర్ణ చిత్రం బడ్జెట్ కారణాల వల్ల గతంలో నిలిచిపోయిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు అదే ప్రాజెక్ట్ మళ్లీ తెరపైకి వచ్చినట్లు బాలీవుడ్ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈసారి కర్ణుడి పాత్ర కోసం బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్‌ను సంప్రదించినట్లు, ఆయన కూడా ఈ ప్రాజెక్ట్‌పై సానుకూలంగా స్పందించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
తాజా ప్రచారం ప్రకారం సల్మాన్ ఖాన్ ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్‌కు అంగీకారం తెలిపినట్లు సమాచారం. అయితే దీనిపై చిత్రబృందం నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. మహాభారతంలోని కర్ణుడి పాత్రను భారీ స్థాయిలో ఆవిష్కరించేలా ప్రణాళికలు సిద్ధమవుతున్నాయని బాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటికే కల్కిలో ప్రభాస్ కర్ణుడి పాత్రలో కనిపించగా, ఇప్పుడు అదే పాత్రలో సల్మాన్ ఖాన్ కనిపిస్తారా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!