
సినిమాలు

విద్యుత్ పొదుపు, వనరుల పరిరక్షణ, స్వయం సమృద్ధి లక్ష్యాలతో టీటీడీ పరిపాలనా భవనం, కార్యాలయాలు, విద్యాసంస్థలు, ఆసుపత్రుల్లో విద్యుత్ వినియోగాన్ని సమర్థవంతంగా నియంత్రించేందుకు టీటీడీ ఈవో ముద్దాడ రవిచంద్ర కీలక ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు అన్ని విభాగాధిపతులు ఈ ఆదేశాలను తక్షణమే అమలు చేయాలని సూచించారు.
అవసరం లేని సమయంలో విద్యుత్ పరికరాలను నిలిపివేయాలని, ఎయిర్ కండిషనర్లను ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:00 గంటల వరకు, అలాగే మధ్యాహ్నం 2:00 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు మాత్రమే వినియోగించాలని ఆదేశించారు. సెలవు రోజుల్లో ప్రత్యేక అనుమతి లేకుండా ఏసీల వినియోగాన్ని నిషేధించారు. విద్యుత్ వినియోగంపై ప్రతి నెల సమీక్షలు, తనిఖీలు నిర్వహిస్తూ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!