
రాజకీయాలు

అక్కినేని అఖిల్ కథానాయకుడిగా నటించిన 'లెనిన్' చిత్రం జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. సినిమా విడుదలకు ముందు తిరుపతిలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో చిత్రబృందంతో పాటు నిర్మాత నాగార్జున కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా అఖిల్ సినిమా ప్రయాణానికి సంబంధించిన పలు ఆసక్తికర విషయాలను అభిమానులతో పంచుకున్నారు.
తన చివరి సినిమా విడుదలై చాలా కాలమైందని, మంచి కథతోనే ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నానని అఖిల్ తెలిపారు. దర్శకుడు మురళీ కిషోర్ అబ్బూరు కథ చెప్పిన వెంటనే అది ఎంతో నచ్చి, ఈ కథను మరెవరికీ చెప్పొద్దని కోరినట్లు వెల్లడించారు. అనంతరం నాగార్జున, నాగ వంశీ కలిసి సినిమాను నిర్మించాలని నిర్ణయించుకున్న సందర్భాన్ని గుర్తు చేసుకుంటూ, 'లెనిన్' ప్రేక్షకుల అంచనాలను తప్పకుండా అందుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!