
ఓటీటీ

ఆంధ్రప్రదేశ్లోని సెంట్రల్ జైళ్లలో ఖైదీల రద్దీ సామర్థ్యాన్ని మించి 124.8 శాతానికి చేరినట్లు జాతీయ నేర గణాంకాల నివేదిక వెల్లడించింది. రాష్ట్ర జైళ్ల సగటు ఆక్యుపెన్సీ రేటు 90.8 శాతంగా నమోదైంది. మొత్తం 7,861 మంది ఖైదీల్లో 5,705 మంది విచారణ ఖైదీలే ఉన్నట్లు తెలిపింది.
జైళ్లలో సిబ్బంది తీవ్ర కొరత ఉందని, 797 పోస్టులు ఖాళీగా ఉన్నాయని నివేదిక పేర్కొంది. యువ నేరస్థుల సంస్కరణ కోసం అవసరమైన బోస్టల్ స్కూళ్లు లేవని కూడా వెల్లడించింది. అలాగే 260 మంది ఖైదీలకు మానసిక రుగ్మతలు ఉన్నట్లు గణాంకాలు తెలియజేశాయి.













కామెంట్స్ (0)
ఇప్పటికి కామెంట్స్ లేవు
మొదటిగా కామెంట్ చేయండి!